Hyderabad: హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు ప్రారంభం

Hyderabad to Vijayawada e garuda buses started today

  • జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ, ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ
  • ఈ రోజు పది బస్సులు ప్రారంభం.. ఏడాది చివరి నాటికి 50 బస్సులు
  • ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను మంగళవారం ప్రారంభించింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఈ బస్సును ప్రవేశపెట్టారు. మియాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని పుష్పక్ బస్సు పాయింట్ వద్ద మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ లు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రోజు పది బస్సులను ప్రారంభించారు. దశలవారీగా 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మిగిలిన బస్సులను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకు రానుంది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ టు విజయవాడ ఎలక్ట్రికల్ ఈ గరుడ బస్సు ఛార్జీని రూ.780గా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News