Telangana: ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించిన టీఎస్ఆర్టీసీ

Bus Fares of E garuda charges down

  • నెల రోజుల పాటు ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటన
  • మియాపూర్ నుండి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.760కి తగ్గింపు
  • ఎంజీబీఎస్ నుండి విజయవాడ ఛార్జీ రూ.720కి తగ్గింపు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిన్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఈ-గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. కొత్త బస్సులను ప్రారంభించిన నేపథ్యంలో నెల రోజుల పాటు ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. 

మియాపూర్ నుండి విజయవాడకు బస్సు ఛార్జీని రూ.830గా నిర్ణయించారు. ఈ ధరను ఇప్పుడు రూ.760కి తగ్గించారు. ఎంజీబీఎస్ నుండి విజయవాడకు రూ.780గా ఉన్న టిక్కెట్ ధరను రూ.720కి తగ్గించారు. నిన్న పది ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సులను ప్రారంభించారు. దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి 50 బస్సులను ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News