Tirumala: శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టిక్కెట్ల షెడ్యూల్
- భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్ కోటాలో శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు
- ప్రతి నెల 18 నుండి 20 వరకు ఆర్జిత సేవల లక్కీ డిప్ నమోదు
- లక్కీ డిప్ లో టిక్కెట్లు పొందిన భక్తులు 20 నుండి 22 వరకు డబ్బులు చెల్లించి టిక్కెట్ ఖరారు చేసుకోవచ్చు
భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ కోటాలో శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లను బుక్ చేసుకునేలా టీటీడీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రతి నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యలో డబ్బులు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలి.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను ప్రతి నెల 21న విడుదల చేస్తారు. శ్రీవాణి, అంగప్రదక్షిణం, వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు ప్రతి నెల 23వ తేదీన, అలాగే రూ.300 దర్శన టికెట్ల కోటాను ప్రతి నెల 24న, తిరుపతిలో గదుల కోటాను ప్రతి నెల 25న, తిరుమలలో గదుల కోటాను ప్రతి నెల 26న విడుదల చేస్తారు.