Chandrababu: అనకాపల్లి వెళుతూ మార్గమధ్యంలో ఓ దుకాణం వద్ద టీ తాగిన చంద్రబాబు

Chandrababu have a tea at Sarippali while going to Anakapalle
  • ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన
  • శృంగవరపుకోట నుంచి అనకాపల్లి వెళుతున్న చంద్రబాబు
  • సరిపల్లిలో ఓ టీ దుకాణం వద్ద ఆగిన వైనం
  • దుకాణ యజమానురాలితో మాట్లాడిన టీడీపీ అధినేత 
  • తమ కష్టాలను చంద్రబాబుతో చెప్పుకున్న మహిళ
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చంద్రబాబు శృంగవరపుకోట నుంచి అనకాపల్లి వెళుతూ మార్గమధ్యంలో సరిపల్లి వద్ద ఆగారు. అక్కడ ఓ దుకాణంలో టీ తాగారు. ఈ సందర్భంగా, టీ దుకాణ యజమానురాలు కలికి శివమ్మతో చంద్రబాబు మాట్లాడారు. 

టీ దుకాణంతో పూట గడవడం కష్టంగా మారిందని శివమ్మ వాపోయింది. తమకు ఇల్లు లేదు, పిల్లల్ని చదివించే ఆర్దిక స్తోమత లేదంటూ చంద్రబాబుకు తమ బాధలు చెప్పుకుంది. శివమ్మ సమస్యల పట్ల చంద్రబాబు స్పందించారు. పిల్లల్ని చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
Chandrababu
Tea
Saripalli
Anakapalle
TDP

More Telugu News