Earthquake: పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ

Huge earthquake in Pacific Ocean

  • 7.7 తీవ్రతతో భూకంపం
  • సముద్ర మట్టానికి 38 కిమీ లోతున భూకంప కేంద్రం
  • మూడు దేశాలకు సునామీ హెచ్చరికలు

ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం. తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 7.7గా గుర్తించారు. సముద్ర మట్టానికి 38 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. 

భారీ భూకంపం నేపథ్యంలో, పలు పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఫిజీ, వెనెవాటు, న్యూ కలెడోనియా దేశాలపై సునామీ ప్రభావం ఉంటుందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ మూడు దేశాల్లో హై అలర్ట్ జారీ చేశారు. పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. అటు, లాయల్టీ దీవుల్లోనూ సునామీ భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News