Revanth Reddy: రేవంత్ రెడ్డి పోస్టర్ పై పేడ కొట్టిన గొల్ల కురుమలు, యాదవులు

Golla Kuruma and Yadavs protest against Revanth Reddy
  • ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి
  • నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన కురుమలు, యాదవులు
  • రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై గొల్ల కురుమలు, యాదవులు మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గొల్ల కురుమలు, యాదవులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనే పోస్టర్లు ఏర్పాటు చేసి దున్నపోతుల పేడను కొట్టారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్ కు, ఆయన పార్టీకి బుద్ధి చెపుతామని హెచ్చరించారు. పేడ పిసుక్కుని బతికిన తలసాని నా గురించి మాట్లాడతాడా? అంటూ ఇటీవల రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ జాతులను అవమానించారంటూ గొల్ల కురుమలు, యాదవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy
Congress
Talasani
BRS

More Telugu News