Jagan: శరత్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం: సీఎం జగన్

CM Jagan condolences to the demise of Sarath Babu
  • మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో శరత్ బాబు మృతి
  • శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం జగన్
  • శరత్ బాబు అన్నిరకాల పాత్రలు పోషించారని వెల్లడి 
ప్రముఖ నటుడు శరత్ బాబు (71) కీలక అవయవాల వైఫల్యంతో ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. శరీరం విషపూరితం (సెప్సిస్) కావడంతో ఆయనను బతికించేందుకు వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. శరత్ బాబు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. శరత్ బాబు మరణంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, సహాయనటుడిగా, అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్ బాబు అని కొనియాడారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని, శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. 
Jagan
Sarath Babu
Demise
Tollywood
Andhra Pradesh

More Telugu News