Narendra Modi: ఆస్ట్రేలియాలో మోదీ క్రేజ్ మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!

Show Of Music Dance Colours As NRIs Charter Flight To Sydney To Greet PM
  • భారత ప్రధానిని కలిసేందుకు ఏకంగా ఫ్లైట్ బుక్ చేసుకున్న అభిమానులు
  • మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణం
  • విమానంలో, ఎయిర్ పోర్టులో డ్యాన్సులు
  • ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఆయన ఏ దేశానికి వెళ్లినా అక్కడున్న భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసేందుకు వస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని కలిసేందుకు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు. సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. తాము ప్రయాణించిన విమానానికి మోదీ ఎయిర్ వేస్ అని పేరుపెట్టుకున్నారు.

మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్ బోర్న్ లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు.

ఐఏడీఎఫ్ సభ్యులు 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తూ వాళ్లు చేసిన హడావుడి మామూలుగా లేదు. చేతిలో మువ్వన్నెల జెండా, టర్బన్లతో విమానంలో డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
Narendra Modi
Indian prime minister
indian australians
NRI
sydney
melbourne
Modi airways

More Telugu News