Karnataka: సిద్ధరామయ్య నివాసం వద్ద ఎమ్మెల్యే సుధాకర్ మద్దతుదారుల ఆందోళన

Congress MLA Sudhakars supporters protest outside Siddaramaiahs residence
  • హిరియూర్ నుంచి ఎన్నికైన డి.సుధాకర్
  • 34 మంత్రి పదవుల్లో ఇంకా 24 ఖాళీలు
  • సిద్ధరామయ్య, డీకే, సుధాకర్ పోస్టర్లతో కార్యకర్తల నినాదాలు
హిరియూర్ ఎమ్మెల్యే డి.సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వెలుపల ఆందోళనకు దిగారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో ఆందోళనకు దిగిన కార్యకర్తలు సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. మొత్తం 34 మంత్రి పదవులకు గాను 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో 24 మంత్రి పదవులను కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌కు మంత్రి పదవి కేటాయించాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.
Karnataka
Siddaramaiah
DK Shivakumar
D.Sudhakar

More Telugu News