Anushka Sharma: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బయల్దేరిన కోహ్లీ, అనుష్క!

Anushka Sharma Virat Kohli jet off to London together fans ask when will we see you in Cannes
  • ముంబై విమానాశ్రయంలో కనిపించిన కోహ్లీ, అనుష్క
  • ఈ నెల 25న ఫ్రాన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొననున్న అనుష్క
  • జూన్ 7న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క నేడు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. గత ఆదివారం బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగడం తెలిసిందే. ఆర్సీబీ ఓటమితో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆ మరుసటి రోజు మే 22న ముంబైకి తిరిగొచ్చారు. తిరిగి మే 24న ముంబై విమానాశ్రయంలో ఈ జంట కనిపించింది. వీరు లండన్ ఫ్లయిట్ ఎక్కి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఎయిర్ పోర్ట్ కు వచ్చిన సందర్భంగా తీసిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో ఎవరో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కెమెరామెన్లకు పోజులిచ్చారు. అనంతరం విమానాశ్రయం గేటు ద్వారా లోపలికి వెళ్లిపోయారు. వీరిద్దరూ క్యాజువల్ వేర్ ధరించి ఉన్నారు. అనుష్క శర్మ ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 కార్యక్రమంలో పాల్గొననుంది. ఈ నెల 25న ఆమె కేన్స్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. లండన్ నుంచి ఆమె ఫ్రాన్స్ కు వెళుతుందని తెలుస్తోంది. (వీడియో కోసం)

విరాట్ కోహ్లీ మరికొందరు టీమిండియా క్రికెటర్లతో కలసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం లండన్ వెళ్లాల్సి ఉంది. అతడు అనుష్కతో కలసి ఫ్రాన్స్ నుంచి భారత్ కు తిరిగొస్తాడా.. లేక లండన్ చేరుకుంటారా? అన్నది తెలియలేదు. జూన్ 7 నుంచి టెస్ట్ ఛాంపియన్ షిప్ జరగనుంది. కోహ్లీతో పాటు మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ మొదటి బ్యాచ్ గా లండన్ వెళ్లే వారిలో ఉన్నారు.  
Anushka Sharma
Virat Kohli
London
kanes film festival
mumbai airport

More Telugu News