Ravi Shastri: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే భారత జట్టు ఇదే కావొచ్చు: రవిశాస్త్రి

Ravi Shastri assumes Team India final mix in WTC summit clash
  • జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • లండన్ ఓవల్ మైదానంలో టీమిండియా × ఆస్ట్రేలియా
  • టీమిండియా తుది జట్టును అంచనా వేసిన రవిశాస్త్రి
జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ మైదానంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మహా టెస్టు సమరంలో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ సహా కొందరు ఆటగాళ్లు లండన్ పయనమయ్యారు. మిగిలిన ఆటగాళ్లు ఐపీఎల్ పూర్తయిన వెంటనే ఇంగ్లండ్ బయల్దేరతారు. 

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలో దిగితే బాగుంటుందో క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి అంచనాలు వెలువరించారు. ఆయన అంచనా ప్రకారం... టీమిండియా తుది జట్టులో నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకుంటారని... రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్నర్లుగా ఉంటారని రవిశాస్త్రి వివరించారు. 

బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలకు తోడు వికెట్ కీపర్ కేఎస్ భరత్ సరిపోతాడని వెల్లడించారు. అయితే జడేజాను ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దింపాలని రవిశాస్త్రి సూచించారు. సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను రవిశాస్త్రి 12వ ఆటగాడిగా పేర్కొన్నారు.

రవిశాస్త్రి అంచనా వేసిన టీమిండియా ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ (12వ ఆటగాడు).


Ravi Shastri
Team India
WTC Final
Oval
London

More Telugu News