Kaleshwaram Tour Package: వీకెండ్స్ లో కాళేశ్వరం టూర్.. రూ.2 వేలలోపే ట్రిప్

hyderabad to kaleshwaram tour from Telangana Tourism
  • హైదరాబాద్ టు కాళేశ్వరం.. ఒక రోజు టూర్ ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం
  • రామప్ప గుడి, మేడిగడ్డ బ్యారేజీ, కనేపల్లి పంప్ హౌజ్, కాళేశ్వర ఆలయం సందర్శించేలా ఏర్పాటు
  • పెద్దలకైతే రూ.1,850, పిల్లలకైతే రూ.1,490 చార్జ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్ వెళ్లాలని అనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఒక రోజు టూర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శని, ఆదివారాల్లో వెళ్లేలా ప్యాకేజీని ప్రారంభించింది. టూర్ ప్యాకేజీలో భాగంగా రామలింగేశ్వర స్వామి (రామప్ప) దేవాలయం, మేడిగడ్డ బ్యారేజీ, కనేపల్లి పంప్ హౌజ్, కాళేశ్వర ఆలయం త‌దిత‌ర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.

ప్రతి శనివారం, ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ లో టూర్ మొదలవుతుంది. సికింద్రాబాద్ యాత్రా నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఉదయం 8 గంటలకు వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ ద‌ర్శ‌నం ఉంటుంది. 

తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ, కనేపల్లి పంప్ హౌజ్ సందర్శిస్తారు. అక్క‌డ‌ నుంచి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

కాళేశ్వరం టూర్ కు పెద్దలకైతే రూ.1,850, పిల్లలకైతే (5 నుంచి 12 సంవత్సరాలు) రూ.1,490 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో బ‌స్సు టికెట్లు, దర్శనం, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం శాఖ వెబ్ సైట్ లో (https://tourism.telangana.gov.in/package/KaleshwaramTour) సంప్రదించవచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి అక్కడికి పర్యాటకులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. టూరిజం శాఖ ప్రత్యేకంగా ప్యాకేజీలు ప్రకటించింది. ప్రపంచంలోనే 'ఇంజినీరింగ్ అద్భుతం'గా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునే ఈ ప్రాజెక్టును చూసేందుకు సాధారణ టూరిస్టులే కాకుండా పలు ప్రభుత్వాల ప్రతినిధులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా వస్తుంటారు. అయితే ఏడాది కిందట వరదలకు పంపు హౌస్ లు మునిగిపోవడం, భారీగా నష్టం జరగడంతో టూర్లను నిలిపేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. తాజాగా మళ్లీ ప్రారంభించారు.
Kaleshwaram Tour Package
Telangana Tourism
Ramappa
Medigadda Barrage
Kaleshwaram Temple
Kanepally Pump House

More Telugu News