Nara Lokesh: లోకేశ్ పాదయాత్రకు బ్రేక్.. కారణమిదే!
- 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు
- మహానాడులో పాల్గొనేందుకు వెళ్లనున్న లోకేశ్
- నాలుగు రోజులపాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం
- ఈనెల 30న జమ్మలమడుగులో యాత్రను పున:ప్రారంభించనున్న లోకేశ్
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రను నాలుగు రోజుల పాటు నిలిపేయనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో లోకేశ్ యాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 30న పున:ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు జమ్మలమడుగులో పాదయాత్రను లోకేశ్ ముగించారు. తర్వాత అక్కడి నుంచి కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకోనున్నారు. రేపు అమరావతి నుంచి బయల్దేరి వెళ్లి.. రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు.
ఇక ఈ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.