Lakshman: పార్లమెంటును మోదీ ప్రారంభించబోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు: లక్ష్మణ్

Lakshman comments on opposition parties criticising Modi
  • ప్రపంచ దేశాలు మోదీకి బ్రహ్మరథం పడుతుండటాన్ని ఓర్చుకోలేకపోతున్నారన్న లక్ష్మణ్
  • మోదీపై విమర్శలు చేస్తే అభాసుపాలు అవుతారని వ్యాఖ్య
  • విపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయని మండిపాటు
ప్రపంచ దేశాలన్నీ ప్రధాని మోదీకి బ్రహ్మరథం పడుతుండటాన్ని ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని మోదీ ప్రారంభించబోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. మోదీపై అనవసర విమర్శలు చేస్తే అభాసుపాలు అవుతారని అన్నారు. కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. 

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ భూమి పూజకు సోనియాగాంధీ ఏ హోదాతో వెళ్లారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆ కార్యక్రమానికి ఛత్తీస్ గఢ్ గవర్నర్ ను ఎందుకు పిలవలేదని నిలదీశారు. 1985లో పార్లమెంట్ కొత్త లైబ్రరీ భవనాన్ని రాజీవ్ గాంధీ ప్రారంభించారని... అప్పుడు రాష్ట్రపతిని అవమానించినట్టు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Lakshman
BJP
Narendra Modi
Parliament

More Telugu News