China: చైనాలో మళ్లీ కరోనా బుసలు..వేరియంట్ల వారీగా టీకాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

China Battles New Wave Of Covid Variant May See 65 Million Cases Weekly
  • చైనాలో కొత్త కరోనా వేవ్
  • జూన్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకోనున్న తీవ్రత
  • వారానికి 65 మిలియన్ కొత్త కేసులకు అవకాశం
  • టీకాలతో కరోనా కట్టడికి చైనా ప్రయత్నాలు
పుట్టిల్లు వీడేది లేదంటున్న కరోనా వైరస్, చైనాలో మరోసారి బుసలు కొడుతోంది. దీంతో, కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడి అధికారులు టీకాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అక్కడి అధికారుల అంచనా ప్రకారం జూన్‌లో తాజా కరోనా వేవ్ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. వారానికి 65 మిలియన్ కొత్త కేసులు వెలుగుచూస్తాయని అంచనా. చైనాలో జీరో కోవిడ్ పాలసీకి స్వస్తిపలికాక కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం చైనా కొత్త వేరియంట్ల వారీగా టీకాలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, చైనాలోని మూడు కొత్త వేరియంట్లను(ఎక్స్‌బీబీ 1.9.1, ఎక్స్‌బీబీ 1.5, ఎక్స్‌బీబీ 1.16) అడ్డుకునే టీకాలకు ప్రాథమిక అనుమతి ఇచ్చామని ప్రముఖ చైనా అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్షాన్ సోమవారం తెలిపారు. గ్వాంగ్జోలో జరిగిన బయోటెక్ కంపెనీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మరో మూడు నాలుగు టీకాలకు కూడా త్వరలో అనుమతులు రానున్నట్టు వెల్లడించారు. 

గత ఏడాది శీతాకాలంలో చైనా జీరో కొవిడ్ పాలసీ పేరిట విధించిన కఠిన ఆంక్షలకు తెరదించింది. ఫలితంగా అప్పట్లో ఒక్కసారిగా జనాభాలో 85 శాతం మంది కరోనా కాటుకు గురయ్యారు.   


China
Corona Virus

More Telugu News