WFI: పోక్సో చట్టాన్ని మార్చమని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: రెజ్లింగ్​ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్​ భూషణ్

WFI chief Brij booked under POCSO says act being misused will force govt to change law

  • రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో పోక్సో  కింద బ్రిజ్‌పై కేసు
  • ఈ చట్టం దుర్వినియోగం అవుతోందన్న బీజేపీ ఎంపీ
  • జూన్‌ 5న అయోధ్యలో 11 లక్షల మంది సాధువులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటన

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ పలువురు స్టార్ రెజ్లర్లు దాదాపు నెల రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, పోక్సో చట్టం పెద్ద స్థాయిలో దుర్వినియోగం అవుతోందని బ్రిజ్ అంటున్నారు. ఈ చట్టాన్ని మార్చమని తాము ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెబుతున్నారు. 

‘ఈ చట్టం చిన్నపిల్లలు, వృద్ధులు, సాధువుల విషయంలో దుర్వినియోగం అవుతోంది. అధికారులు కూడా దీని దుర్వినియోగానికి అతీతులు కారు. సాధువుల నేతృత్వంలో మేం ఈ చట్టాన్ని మార్చమని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం’ అని పేర్కొన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. జూన్ 5న అయోధ్యలో 11 లక్షల మంది సాధువులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బ్రిజ్ తెలిపారు. రెజ్లర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని బ్రిజ్ భూషణ్ సింగ్ పునరుద్ఘాటించారు. పోక్సో చట్టంలోని వివిధ అంశాలను పరిశీలించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News