Kangana Ranaut: వైద్యనాథ్ ఆలయానికి షార్ట్ వేసుకుని వచ్చిన బాలిక.. మండిపడ్డ కంగనా
- పబ్ కు వెళ్లినట్టుగా ఆలయానికి వచ్చారంటూ ఓ ట్విట్టర్ యూజర్ విమర్శ
- సమర్థించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్
- అలాంటి మూర్ఖులకు కఠిన నిబంధనలు ఉండాలన్న అభిప్రాయం
ఓ బాలిక షార్ట్ ధరించి (కురచ దుస్తులు) ఆలయానికి రావడం వివాదాస్పదం అవుతోంది. పాశ్చాత్య దస్తులు ధరించి హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రాలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ వైద్యనాథ్ ఆలయానికి బాలిక రావడాన్ని ఓ ట్విట్టర్ యూజర్ వెలుగులోకి తెచ్చాడు. ఆలయ ప్రాంగణంలో ఇద్దరు బాలికలు పక్కపక్కనే నుంచుని ఉండగా, అందులో ఒక బాలిక పైన, కింద కురచ దుస్తులు వేసుకుని ఉంది.
‘‘ఇది వైద్యనాథ్ ఆలయంలో కనిపించిన దృశ్యం. హిమాచల్ ప్రదేశ్ లో పేరొందిన ఆలయం. వారు పబ్ లేదా నైట్ క్లబ్ నకు వెళ్లిన మాదిరే ఆలయానికి వచ్చారు. ఆలయంలోకి అలాంటి వారిని అనుమతించకూడదు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను’’ అంటూ ఈ బాలిక ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన వ్యక్తి హిందీలో ట్వీట్ చేశాడు. దీన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చూసి సమర్థించింది. తన గత అనుభవాన్ని కూడా పంచుకుంది.
‘‘ఇవి పాశ్చాత్య దుస్తులు. వీటిని కొనుగొన్నదీ, వీటికి ప్రచారం కల్పించినది తెల్లవారు. ఒకసారి నేను వాటికన్ లో షార్ట్, టీ షర్ట్ వేసుకుని వెళితే నన్ను ప్రాంగణంలోకి అనుమతించలేదు. దాంతో నేను నా హోటల్ గదికి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాను. నైట్ డ్రెస్ ను క్యాజువల్స్ మాదిరిగా వేసుకున్న వీరు సోమరిపోతులు మినహా మరేమీ కాదు. వారికి వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. కానీ, అలాంటి మూర్ఖులకు కఠిన నిబంధనలు ఉండాల్సిందే’’ అని కంగనా రనౌత్ తన అభిప్రాయాలను షేర్ చేసింది.