Mumbai Indians: వర్షం ఆగింది... టాస్ పడింది!

MI won the toss in IPL Qualifier 2
  • నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-2
  • గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్ 
  • అహ్మదాబాద్ లో శాంతించిన వరుణుడు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్వాలిఫయర్-2 నిర్వహణకు వీలు కలిగిస్తూ వరుణుడు శాంతించాడు. అహ్మదాబాద్ లో వర్షం నిలిచిపోవడంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం జట్టులో ఒక మార్పు చేసినట్టు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ తెలిపాడు. హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తికేయను తీసుకున్నట్టు వివరించాడు. తమ జట్టులో రెండు మార్పులు చేసినట్టు గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. దసున్ షనక, దర్శన్ నల్కండే స్థానంలో జోష్ లిటిల్, సాయి సుదర్శన్ లను తుదిజట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించాడు. 

ఒకవేళ వర్షంతో ఈ మ్యాచ్ రద్దయిపోతే, లీగ్ దశలో సాధించిన పాయింట్ల ఆధారంగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుంది.
Mumbai Indians
Gujarat Titans
Toss
Qualifier-2
IPL

More Telugu News