Villagers: బందిపోట్లు అనుకుని... చీతా ప్రాజెక్టు సభ్యులను చితకబాదారు!

Villagers beat Project Cheetah members

  • ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతా ఆశా తప్పించుకున్న వైనం
  • గాలింపు చేపట్టిన చీతా ప్రాజెక్టు సిబ్బంది
  • జీపీఎస్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు
  • పశువులు ఎత్తుకుపోవడానికి వచ్చారని భావించిన గ్రామస్తులు
  • కాల్పులు జరిపి, రాళ్లు విసిరి దాడికి పాల్పడిన వైనం

ఇటీవల విదేశాల నుంచి తీసుకువచ్చిన చీతాలు భారత్ లో వరుసగా మృత్యువాతపడుతుండడం తెలిసిందే. ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఈ చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. కాగా, ఈ అభయారణ్యం నుంచి ఆశా అనే చీతా తప్పించుకుంది. ఈ చీతాను వెదుకుతూ వెళ్లిన అధికారులు, ఇతర సిబ్బంది గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. 

చీతా మెడకు జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో, ఆ చీతా బురాఖేడా గ్రామం సమీపంలో ఉన్నట్టు జీపీఎస్ సిగ్నల్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో, బురాఖేడా గ్రామం వద్ద అటవీప్రాంతంలో రాత్రివేళ చీతాను గాలిస్తున్న చీతా ప్రాజెక్టు సభ్యులను గ్రామస్తులు బందిపోట్లుగా పొరబడ్డారు. పశువులను ఎత్తుకెళ్లడానికి వచ్చారని భావించి వారిపై నాటు తుపాకులతో కాల్పులు జరిపారు... రాళ్లు కూడా విసిరారు. కాల్పులు, రాళ్ల దాడితో హడలిపోయిన ఆ బృందం సభ్యులను పట్టుకుని చితకబాదారు. 

ఈ దాడిలో నలుగురు అటవీసిబ్బందికి గాయాలయ్యాయి. వారి వాహనం కూడా ధ్వంసం అయింది. బందిపోట్లు ధరించే 'దుంగారీ' దుస్తులను పోలిన దుస్తులనే చీతా ప్రాజెక్టు సభ్యులు ధరించడమే గ్రామస్తులు వారిని బందిపోట్లుగా పొరబడడానికి కారణమైంది.

  • Loading...

More Telugu News