Sunil Gavaskar: కెప్టెన్ గా పాండ్యా తన సత్తా చాటే అవకాశం: సునీల్ గవాస్కర్

IPL 2023 final against CSK good chance for Hardik Pandya to show his evolution as captain Sunil Gavaskar
  • పాండ్యా ఎంతో ఉత్సాహం కలిగిన వ్యక్తి అన్న గవాస్కర్  
  • పాండ్యాకు తాను ఎంత నేర్చుకున్నదీ వ్యక్తం చేసే అవకాశం
  • సీఎస్కే మాదిరి సంతోషకరమైన జట్టుగా పేర్కొన్న గవాస్కర్
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యా సామర్థ్యాలకు పరీక్ష వంటిదన్న అభిప్రాయాన్ని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 

‘‘ఎంఎస్ ధోనీ అంటే తనకు ఎంత గౌరవం, అభిమానమో హార్థిక్ బహిరంగంగానే చెబుతుంటాడు. వారు టాస్ సమయంలో ఎంతో స్నేహపూర్వకంగా కనిపిస్తారు. కానీ, మ్యాచ్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. హార్థిక్ పాండ్యా తాను ఎంత వేగంగా నేర్చుకున్నదీ తెలియజేసేందుకు ఇదొక మంచి అవకాశం’’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

గతేడాది మొదటిసారి అతడు కెప్టెన్ గా వ్యవహరించడానికి ముందు అతడి సామర్థ్యాల గురించి ఎవరికీ తెలియదు. అతడు అత్యంత ఉత్సాహం ఉన్న క్రికెటర్లలో ఒకడు. ఆ ఉత్సాహం ఏ పాటిదో గతేడాది చూశాం. జట్టులో ప్రశాంతతను తీసుకురావడం అన్నది ధోనీని గుర్తు చేస్తుంది. సీఎస్కే మాదిరే ఇది ఎంతో సంతోషకరమైన జట్టు’’ అని సునీల్ పేర్కొన్నారు.  

Sunil Gavaskar
opinion
IPL 2023 final
Hardik Pandya

More Telugu News