Naveen Ul Haq: అది ఫేక్ అకౌంట్... కోహ్లీకి తాను సారీ చెప్పలేదన్న ఆఫ్ఘన్ బౌలర్

Afghan bowler Naveen Ul Haq clarifies he did not say sorry to Kohli
  • ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో కోహ్లీ, నవీనుల్ హక్ మధ్య వాగ్వాదం
  • నవీనుల్ హక్ ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్
  • మైదానంలోనూ నవీనుల్ హక్ కనిపిస్తే చాలు.. గోల గోల!
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత కోహ్లీ అభిమానులు నవీనుల్ హక్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 

లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడుతుంటే, గ్యాలరీలోని ప్రేక్షకులు నవీనుల్ హక్ ను ఉద్దేశించి నినాదాలు చేయడం కామన్ గా మారిపోయింది. నవీనుల్ హక్ సోషల్ మీడియాలో ఏ పోస్టు చేసినా, దాంతో కోహ్లీకి ఏమైనా లింకు ఉందేమోనని పరిశీలించడం పరిపాటిగా మారింది. 

అయితే, ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్... ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయాక నవీనుల్ హక్ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్టు దర్శనమిచ్చింది. అందులో... నేను పెద్ద మిస్టేక్ చేశాను... ఐయాం సారీ విరాట్ కోహ్లీ అని ఉంది. 

ఈ పోస్టు వైరల్ కావడంతో నవీనుల్ హక్ స్పందించాడు. అది ఫేక్ అకౌంట్ అని, తాను కోహ్లీకి సారీ చెప్పలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
Naveen Ul Haq
Virat Kohli
Altercation
RCB
LSG
IPL
Afghanistan

More Telugu News