New Parliament: స్వాతంత్ర్యం సిద్ధించాక పార్లమెంటులో తొలి అడుగు పెట్టిన రావి నారాయణరెడ్డి మనోడే!
- 1951-52లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు
- నల్గొండ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రావి నారాయణరెడ్డి
- కాంగ్రెస్ అభ్యర్థి వి.భాస్కరరావుపై 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం
- నెహ్రూ చొరవతో పార్లమెంటులో తొలి అడుగు వేసిన రావి
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పాత పార్లమెంటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న రావి నారాయణరెడ్డి ఆ ఎన్నికల్లో నల్గొండ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వి. భాస్కరరావుపై 2,22,280 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రావి నారాయణరెడ్డి స్వస్థలం ప్రస్తుత యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామం.
ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ (పూర్పూర్) నుంచి పోటీ చేసిన నెహ్రూ.. కేఎంపీపీ అభ్యర్థి బన్సీలాల్పై 1,73,929 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నెహ్రూ చొరవతో రావి నారాయణరెడ్డి పార్లమెంటులో తొలి అడుగుపెట్టి ఆ ఘనత సాధించిన తెలుగు వ్యక్తిగా రికార్డులకెక్కారు.