Tollywood: క్రియేటివ్ టాలెంట్‌కు వెల్​కం చెబుతున్న ప్రశాంత్ వర్మ

Prasanth Varma Cinematic Universe welcomes creative talent

  • ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఏర్పాటు చేసిన యువ దర్శకుడు
  • ఇందులో హనుమాన్, అధీరా చిత్రాలకు రూపకల్పన
  • యువ దర్శకులు, రచయితలు, నటులకు ఆహ్వానం

అ!, కల్కి, జాంబీ రెడ్డి.. ఇలా చేసింది మూడు సినిమాలే అయినా తన క్రియేటివిటీతో టాలీవుడ్ లో మంచి పేరు సాధించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) ఏర్పాటు చేసి ‘హను-మాన్‌’ అనే ప్యాన్ ఇండియా తీస్తున్నాడు. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పలు విదేశీ భాషల్లోనూ విడుదల కానుంది. పీవీసీయూ ద్వారా మన దేశ సూపర్ హీరోల కథలను ప్రపంచానికి తెలియజేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘అధీరా’ అనే సూపర్ హీరో సినిమాను ప్రకటించాడు. 

పీవీసీయూలో సీనియర్ నటుడు బాలకృష్ణ కూడా ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు ప్రశాంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా క్రియేటివ్ టాలెంట్ ఉన్న వారికి అవకాశం కల్పించేందుకు ఓ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశాడు. తన పీవీసీయూలో పని చేసేందుకు ‌రచయితలు, దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్లు, కాన్సెప్ట్ ఆర్టిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, లైన్ ప్రొడ్యూసర్లు తదితరుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు [email protected] వెబ్‌ సైట్ ను సంప్రదించాలని ప్రశాంత్ వర్మ సూచించాడు.

  • Loading...

More Telugu News