Telugu Heritage Week: తెలుగు హెరిటేజ్ వీక్ ను ప్రకటించిన నార్త్ కరోలినా రాష్ట్రం... చంద్రబాబు హర్షం
- అమెరికాలో తెలుగుకు విశిష్ట గుర్తింపు
- మే 28 నుంచి జూన్ 3 వరకు తెలుగు హెరిటేజ్ వీక్
- ఆమోద ముద్ర వేసిన నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్
- ఎంతో శుభవార్త అని అభివర్ణించిన చంద్రబాబు
అమెరికాలో తెలుగు ప్రాభవం పెరుగుతోంది. చార్లోటే నగరం మే 28వ తేదీని తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నార్త్ కరోలినా రాష్ట్రం తెలుగు హెరిటేజ్ వీక్ ను ప్రకటించింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.
నిజంగా ఇది ఎంతో శుభవార్త అని అభివర్ణించారు. గౌరవనీయ నార్త్ కరోలినా గవర్నర్ మే 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు తెలుగు హెరిటేజ్ వీక్ గా ప్రకటించారని చంద్రబాబు వెల్లడించారు. మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇది స్వాగతనీయం అని వివరించారు. ప్రపంచ చిత్రపటంలో తెలుగు సమాజానికి దక్కిన మరో గుర్తింపు అని కొనియాడారు.