Jawahar: మినీ మేనిఫెస్టోకే ఇంతగా మంటలు పుడితే..: జవహర్

Jawahar fires on YSRCP
  • పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలకు మాటలు కూడా రావన్న జవహర్
  • మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని వ్యాఖ్య
  • వైసీపీ చేయలేని పనులు తాము చేయబోతున్నామన్న జవహర్
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేనిఫెస్టోపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ... మినీ మేనిఫెస్టోకే ఇంతగా మంటలు పుడితే... పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలకు మాటలు కూడా రావని అన్నారు. 

మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. పేదరికాన్ని జయించేందుకు బిడ్డలు భారంగా మారకూడదనే చదివే బిడ్డలందరికీ రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. మహిళల కంట కన్నీరు రాలకూడదనే ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. బువ్వ పెట్టే రైతుకు ఆసరాగా సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తామని తెలిపారు. వైసీపీ చేయలేని పనులు తాము చేయబోతున్నామని చెప్పారు. మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. 

Jawahar
Telugudesam
YSRCP
Manifesto

More Telugu News