Gurugram: కదులుతున్న కారుపై పుష్ అప్స్.. గురుగ్రాంలో యువకుల నిర్వాకం

Gurugram Man Seen Doing Push Ups On Top Of Moving Car
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాహనదారులు
  • నిందితుడిని అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • కారు యజమానికి రూ.6,500 జరిమానా
కదులుతున్న కారుపై కూర్చుని మద్యం తాగుతూ, పుష్ అప్స్ చేస్తూ కొంతమంది యువకులు హంగామా చేశారు. గురుగ్రాంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. యువకుల తీరుతో తోటి వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఓ కారులో ఉన్న వారు ఇదంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు స్పందించి కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు యజమానికి రూ.6,500 జరిమానా విధించారు. కారుపై ప్రమాదకరంగా ప్రయాణించిన యువకుడిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ విజేందర్ విజ్ తెలిపారు.

మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వైరల్ గా మారిన వీడియోలో వైట్ కలర్ కారుపైన ఓ యువకుడు పుష్ అప్స్ చేస్తుండడం కనిపిస్తోంది. అతడి స్నేహితులు కారు విండోలో నుంచి తలలు బయటపెట్టి చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా కారు వెళుతుండగానే జరిగింది. వారి వెనక వస్తున్న కారులో నుంచి ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయడం, అదికాస్తా వైరల్ గా మారడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కాగా, రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే సహించబోమని గురుగ్రాం ట్రాఫిక్ డీసీపీ విజేందర్ హెచ్చరించారు.
Gurugram
Push Ups On Car
Traffic police
Traffic rules
Fine

More Telugu News