HMDA: ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు మరోమారు వేలం

 HMDA issues E Auction notification for Uppal Bhagayat plots
  • నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ
  • మొత్తం 63 ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు
  • జూన్ 30న ఈ-వేలం నిర్వహించనున్న అధికారులు
హైదరాబాదు శివారు ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లోని ప్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ మరోమారు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ లేఅవుట్ లోని 63 ప్లాట్లను వేలం వేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశామని, జూన్ 30 న ఈ-వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు హెచ్ఎండీఏ ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 63 ప్లాట్లు వేలం వేయనున్నారు.

ఒక్కో ప్లాటు 464 చదరపు గజాల నుంచి 11,374 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్లాట్లకు కనీస ధరగా చదరపు గజానికి రూ.35 వేలుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి జూన్ 13న ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువును జూన్ 27గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
HMDA
Uppal Bhagayat plots
E-Auction
Notification

More Telugu News