wreslers: ఆరోపణలు రుజువైతే నేనే ఉరేసుకుంటాను: రెజ్లర్ల అంశంలో బ్రిజ్ భూషణ్ స్పందన

Will hang myself if charges against me proved says Brij Bhushan

  • మహిళా రెజ్లర్ల ఆరోపణలపై స్పందించిన భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్
  • నన్ను ఉరి తీయాలని నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్య
  • రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచన
  • కోర్టు తనను ఉరితీయాలంటే అందుకు అంగీకరిస్తానని వ్యాఖ్య

మహిళా రెజ్లర్ల నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం స్పందించారు. తనపై ఒక్క ఆరోపణ రుజువైనా తనంతట తానే ఉరివేసుకుంటానని చెప్పారు. అదే సమయంలో ఆయన రెజ్లర్లపై సానుకూల దృక్పథంతో మాట్లాడారు. రెజ్లర్లంతా తన పిల్లల వంటి వారని, తన రక్తం, చెమట కూడా వారి విజయానికి కారణమైనందున వారిని ఏ విషయంలోను నిందించనని చెప్పారు. రాంనగర్ ప్రాంతంలోని మహదేవ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని మరోసారి చెబుతున్నానని అన్నారు.

'నన్ను ఉరి తీయాలని వారు (రెజ్లర్లు) కోరుతూ నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నన్ను ఉరి తీయడం లేదు. అందుకే వారు తమ పతకాలను గంగలో ముంచేందుకు వెళుతున్నారు. పతకాలను గంగలో విసిరినంత మాత్రాన బ్రిజ్ భూషణ్ ను ఉరి తీయరు. మీ వద్ద రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లి ఇవ్వవచ్చు. కోర్టు నన్ను ఉరితీయమంటే నేను దానిని అంగీకరిస్తాను' అన్నారు.

'ఆటగాళ్లంతా నా బిడ్డల్లాంటి వారే... కొన్ని రోజుల క్రితం వరకు నన్ను రెజ్లింగ్ దేవుడు అని పిలిచేవారు... నేను రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోనే భారత్‌కు 20వ ర్యాంక్‌ వచ్చింది.. ఈ రోజు నా కష్టంతో ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రెజ్లింగ్ జట్లలో భారత్ నిలిచింది' అన్నారు. "నేను పగలు, రాత్రి రెజ్లింగ్‌ కోసం జీవించాను. ఏడు ఒలింపిక్ పతకాలలో ఐదు (రెజ్లింగ్‌లో) నా పదవీకాలంలోనే భారత్‌కు వచ్చాయి. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి' అని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News