actor Siddharth: లవ్ లైఫ్ పై రిపోర్టర్ ప్రశ్నకు నటుడు సిద్ధార్థ తెలివైన సమాధానం

Reporter asks Siddharth provocative question about his love life at event
  • అదితీరావు తో డేటింగ్ ను ప్రశ్నించిన ఓ రిపోర్టర్
  • వ్యక్తిగత ప్రేమ జీవితంలో సక్సెస్ లేదేమంటూ ప్రశ్న
  • ఇద్దరం వ్యక్తిగతంగా దీనిపై మాట్లాడుకుందామంటూ బదులిచ్చిన సిద్థార్థ
నటీ నటులు పలు సందర్భాల్లో ఇబ్బందికరమైన ప్రశ్నలను మీడియా నుంచి ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమయంలో కొందరు అసలు స్పందించకుండా ఉంటే, కొందరు ఆవేశంగానూ, కొందరు తెలివిగానూ వ్యవహరిస్తుంటారు. నటుడు సిద్ధార్థ కూడా ఇలానే చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ఒక తెలుగు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సిద్ధార్థ ఎంతో చక్కగా స్పందించాడు. 

సిద్ధార్థ నటించిన టక్కర్ అనే సినిమా తమిళం, తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాకి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ మైక్ పుచ్చుకుని, అదితి రావు హైదరితో సిద్ధార్థ డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లను ప్రస్తావించాడు. ప్రేమ చిత్రాలకు ఎంతో పేరొందిన సిద్ధార్థ, వ్యక్తిగత జీవితంలో అంత సక్సెస్ కాకపోవడాన్ని కూడా సదరు రిపోర్టర్ ప్రశ్నించాడు. 

‘‘నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇలా ఆలోచించ లేదు. నా కలలో కూడా జరగలేదు. నా ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు కూడా. కానీ, నా లవ్ లైఫ్ (ప్రేమ జీవితం) గురించి నీవు అంతగా ఆందోళన చెందుతున్నందున ఇద్దరం కలసి వ్యక్తిగతంగా దీనిపై మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇతరులకు దీనితో పనిలేదు. టక్కర్ సినిమాకు కూడా దీనితో సంబంధం లేదు’' అని సిద్ధార్థ బదులిచ్చాడు.
actor Siddharth
takkar movie
release
Reporter
questioned
personal life

More Telugu News