wrestlers: కోరిక తీరిస్తే ఖర్చు భరిస్తానన్నాడు.. బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్ ఆరోపణ

Brij Bhushan singh asked sexual favours in return medical treatment says one of the wrestler
  • బయటపడుతున్న ఎఫ్ఐఆర్ లోని కీలక విషయాలు
  • ఎఫ్ఐఆర్ కాపీలను ప్రచురించిన జాతీయ మీడియా
  • తమ గదుల నుంచి బయటకు రావడమే మానేశామని ఆవేదన
  • బృందాలుగా వెళ్లినా ఒక్కరిని పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించేవాడని ఆరోపణ
రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలు బయటకు పొక్కాయి. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వివరాలను ప్రచురించాయి. ఇందులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్రిజ్ భూషణ్ పై ఓ మహిళా రెజ్లర్ చేసిన ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. విదేశాలలో జరిగిన పోటీల్లో తాను గాయపడిన సందర్భంలో బ్రిజ్ భూషణ్ తనతో అసభ్యంగా మాట్లాడారని సదరు రెజ్లర్ ఆరోపించింది. తన కోరిక తీరిస్తే ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చు మొత్తం ఫెడరేషన్ భరించేలా చూస్తానని చెప్పాడన్నారు.

బ్రిజ్ భూషణ్ కు భయపడి వీలైనంత వరకు తమ గదులలో నుంచి బయటకు రావడం మానేశామని రెజ్లర్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే నలుగురు ఐదుగురం కలిసి వచ్చేవారమని వివరించారు. అయినా కూడా తమలో నుంచి ఒకరిని పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడేవారని చెప్పారు. కోచ్ లేని సమయంలో వచ్చి తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని అన్నారు.  ఒకసారి తన టీషర్ట్ లాగారని, ఛాతీ, పొట్టపై అభ్యంతరకరంగా తాకారని మరో రెజ్లర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
wrestlers
bri bhushan
FIR
Wrestling
harrasment

More Telugu News