wireless earphones: ఇయర్ బడ్స్ తో వినికిడి శక్తి కోల్పోయిన యువకుడు

Gorakhpur boy loses hearing ability after using wireless earphones for long hours

  • గంటల తరబడి టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ధారణ
  • చెవిలో ఇన్ఫెక్షన్ తో వినికిడి శక్తికి నష్టం
  • సర్జరీ చేసి పునరుద్ధరించిన వైద్యులు

మనలో చాలా మంది ఇయర్ బడ్స్ వాడుతుంటారు. ముఖ్యంగా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ వచ్చిన తర్వాత యువతలో వీటి వాడకం గణనీయంగా పెరిగింది. చిన్న ఇయర్ పీస్, చాలా తక్కువ బరువు, వాడకంలో సౌకర్యం, అందానికి అందం ఇవన్నీ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ పట్ల ఆకర్షణను పెంచుతున్నాయి. యూపీలోని గోరఖ్ పూర్ కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఈ బడ్స్ ధరించి గంటల తరబడి ఆడియో వినడంతో.. చివరికి అతడు వినికిడి శక్తిని కోల్పోయాడు.

ఇయర్ బడ్స్ అదే పనిగా వాడడంతో చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో వినే శక్తిని కోల్పోయాడు. వైద్యులను సంప్రదించగా, శస్త్రచికిత్స చేసి వినికిడి శక్తిని పునరుద్ధరించారు. అందుకే ఇయర్ బడ్స్ వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువ సమయం పాటు ధరించి ఉండడం వల్ల ఇయర్ కెనాల్ లో తేమ పెరుగుతుంది. అది బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలిస్తుంది. అందుకని చెవి మార్గంలో ఎలాంటివి కూడా ఎక్కువ సమయం పాటు అడ్డు పెట్టకూడదు. 

నివారణలు
ఇయర్ బడ్స్ ను గంటల తరబడి కాకుండా కొన్ని నిమిషాల పాటు పెట్టుకున్న తర్వాత తీసి కొంత విరామం ఇవ్వాలి. ఇయర్ బడ్స్ గరిష్ఠ వ్యాల్యూమ్ లో 60 శాతం మించి పెట్టుకోకూడదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్నవి అయితే బయటి శబ్దాలు వినిపించవు. అప్పుడు వ్యాల్యూమ్ ను చాలా తక్కువగా పెట్టుకోవచ్చు. చెవులను కొన్ని రోజులకు ఒకసారి చొప్పున శుభ్రం చేసుకోవాలి. చెవి లోపలికి వెళ్లేవి కాకుండా చెవి బయట పెట్టుకునే హెడ్ సెట్ ధరించడం మరో మార్గం.

  • Loading...

More Telugu News