fixed dose medicines: ఈ కాంబినేషన్ తో కూడిన ఔషధాలతో హాని.. నిషేధం విధించిన కేంద్రం

India bans 14 fixed dose medicines for likely posing risks to health

  • ఫలితాలకు సంబంధించి శాస్త్రీయత లేదన్న కేంద్రం
  • వీటితో ఆరోగ్యానికి హాని కలగొచ్చన్న సందేహం
  • నిపుణుల కమిటీ సూచన మేరకు నిషేధిస్తూ నిర్ణయం

ఆరోగ్యానికి హాని కలిగించే 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్ డీసీ) ఔషధాలను కేంద్ర సర్కారు నిషేధించింది. వీటికి చికిత్సా పరమైన శాస్త్రీయత లేదంటూ, ఆరోగ్యానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందంటూ నిపుణుల కమిటీ చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ అంటే.. రెండు లేదా అంతకుమించి యాక్టివ్ ఇంగ్రేడియెంట్స్ (కాంపౌండ్స్) అందులో ఉంటాయి. డోసేజ్ కూడా ఫిక్స్ డ్ గా ఉంటుంది. అధిక శాతం ప్రజల ప్రయోజనాల రీత్యా వీటి తయారీ, విక్రయాలు, పంపిణీని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. 

(నిమెసులైడ్, ప్యారాసెటమాల్ డిస్పర్సబుల్ ట్యాబ్లెట్లు), (అమోక్సిసిల్లిన్, బ్రొమెహెక్సైన్), (ఫోల్కోడిన్, ప్రొమెథజైన్), (క్లోర్ ఫెనిరమైన్ మైలేట్, డెక్ట్రో మెథార్ఫన్, గ్వైఫెన్సిస్, అమ్మోనియం క్లోరైడ్, మెంథాల్), (క్లోర్ ఫెనిరమైన్ మైలేట్, కోడీన్ సిరప్), (అమ్మోనియం క్లోరైడ్, బ్రొమ్ హెక్సైన్, డెక్ట్రోమెథార్ఫన్), (సాల్బూటమాల్, బ్రొమెహెక్సైన్, క్లోరోఫెనిరమైన్ మైలేట్, గ్వైఫెన్సిన్) తదితర కాంబినేషన్ ఔషధాలను నిషేధించారు.

  • Loading...

More Telugu News