Train Accident: 1995 తర్వాత ఇదే అత్యంత ఘోర రైలు ప్రమాదం!
- మృతుల సంఖ్యాపరంగా మూడో భయంకరమైన రైలు ప్రమాదం
- 1981లో భాగమతి, 1995లో ఫిరోజాబాద్‌లో ఘోర రైలు ప్రమాదాలు
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య 900 కంటే ఎక్కువగా ఉంది. 1995 నుండి అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా ఒడిశా రైలు ప్రమాదం నిలిచింది. భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదాల చరిత్రలో ఒడిశా రైలు ప్రమాదం మూడో అతిపెద్దది. మృతుల సంఖ్య పరంగా భయంకరమైన రైలు ప్రమాదం. అంతకుముందు 1981లో బీహార్ లోని భాగమతి ప్రమాదంలో 750 మందికి పైగా, 1995లో యూపీలోని ఫిరోజాబాద్ లో జరిగిన రైలు ప్రమాదంలో 310 మంది చనిపోయారు.
బాలాసోర్‌లో ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.