YS Avinash Reddy: ముగిసిన అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ

CBI questioning on Avinash Reddy concluded

  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి
  • ఇటీవల ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
  • ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాశ్ కు ఆదేశాలు
  • ఈ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు విచారణ 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో ఓ షరతు విధించించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో, అవినాశ్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయను సీబీఐ అధికారులు ఆరున్నర గంటల పాటు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి అవినాశ్ ఎవరితో మాట్లాడాడన్నదానిపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై అవినాశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు సమాచారం. 

ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు విచారణ ముగియడంతో తన నివాసానికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News