Dulipalla narendra: సజ్జల వ్యాఖ్యల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది: ధూళిపాళ్ల నరేంద్ర

Dhulipalla narendra counter tweet to sajjala comments on nara lokesh
  • లోకేశ్ పై సజ్జల కామెంట్స్ పై మండిపడ్డ టీడీపీ నేత
  • మానసిక వైకల్యం ఎవరికి ఉందో రాష్ట్రం మొత్తానికీ తెలుసని వ్యాఖ్య
  • ఇప్పుడు మీరు చేస్తున్న బానిసత్వంపై రేపు మీకే అసహ్యం కలుగుతుందన్న ధూళిపాళ్ల
క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జలకు త్వరలో తన ఉద్యోగం పోతుందనే భయం పట్టుకుంది, దీంతో ప్రస్టేషన్ కు గురై నోరు జారుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. నారా లోకేశ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధూళిపాళ్ల ఖండించారు.

సజ్జల వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నేత కింద పనిచేస్తున్నమీరు (సజ్జల) పుట్టుకల గురించి మాట్లాడితే జనం హర్షించరని అన్నారు. సైకో ఎవరో, మానసిక వైకల్యంతో బాధపడుతున్నది ఎవరో రాష్ట్రం మొత్తానికీ తెలుసని ధూళిపాళ్ల చెప్పారు. ఎవరి పుట్టుక ఇటు రాష్ట్రానికి, అటు సొంత కుటుంబానికి శాపంగా మారిందనేది కూడా అందరికీ తెలుసని అన్నారు.

క్రిమినల్ కోసం క్రిమినల్ పనులు చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. సజ్జల భవిష్యత్ దుర్భరంగా ఉండబోతోందని, ఆయన అహంకారం కుప్ప కూలుతుందని అన్నారు. ఇప్పుడు చేస్తున్న బానిసత్వం గుర్తుచేసుకుంటే మీ పుట్టుకపై మీకే అసహ్యం కలుగుతుందని సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సజ్జల వంటి బాడుగ నేతల బతుకుల లెక్కలన్నీ తేలుస్తామని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.
Dulipalla narendra
TDP
Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News