Aanam Venkata Ramana Reddy: నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం

Attack on TDP leader Anam Venkata Ramana Reddy in Nellore
  • నెల్లూరులో ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఘటన
  • బైకులపై వచ్చి ఆనంపై కర్రలతో దాడికి యత్నం
  • అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
  • బైకులు, కర్రలు అక్కడే వదిలి పరారైన వ్యక్తులు
ప్రతి మాటలోనూ ఓ చమక్కుతో రాజకీయ ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధిస్తూ, అదే సమయంలో తన కామెడీ టైమింగ్ తోనూ అలరించే టీడీపీ నేతగా ఆనం వెంకటరమణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు నెల్లూరులో దాడికి యత్నించారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. 

బైకులపై వచ్చిన 10 మంది వ్యక్తులు కర్రలతో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఆ వ్యక్తులు బైకులు, కర్రలు అక్కడే వదిలి పరుగులు తీశారు. వైసీపీ కార్యకర్తలే దాడికి యత్నించారని ఆనం అనుచరులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినందుకే దాడి చేసేందుకు వచ్చారని ఆరోపించారు.
Aanam Venkata Ramana Reddy
Attack
Nellore
TDP
YSRCP

More Telugu News