Josh Hazelwood: డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బ

Josh Hazelwood out from WTC Final due to side strain
  • టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
  • జూన్ 7 నుంచి మ్యాచ్
  • గాయంతో వైదొలగిన హేజెల్ వుడ్
  • ఐపీఎల్ సమయంలోనే గాయపడిన హేజెల్ వుడ్
  • ఇంకా కోలుకుని ఆసీస్ సీనియర్ ఫాస్ట్ బౌలర్
టీమిండియాతో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనుభవజ్ఞుడైన పేసర్ జోష్ హేజెల్ వుడ్ గాయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ సమయంలోనే హేజెల్ వుడ్ గాయంతో బాధపడ్డాడు. దాంతో చాలా మ్యాచ్ లు ఆడలేదు. తాజాగా హేజెల్ వుడ్ గాయంతో జట్టు నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ మైకేల్ నెసెర్ ను ఎంపిక చేశారు. 

జూన్ 16 నుంచి ఇంగ్లండ్ తో 5 టెస్టుల యాషెస్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో, ఆ ప్రతిష్ఠాత్మక సిరీస్ కు సన్నద్ధమయ్యేందుకు హేజెల్ వుడ్ ను డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఆసీస్ జట్టు నుంచి తప్పించినట్టు అర్థమవుతోంది. యాషెస్ ప్రారంభం నాటికి హేజెల్ వుడ్ కోలుకుంటాడని ఆసీస్ శిబిరం భావిస్తోంది. 

హేజెల్ వుడ్ స్థానంలో ఎంపికైన మైకేల్ నెసెర్ ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. 3 మ్యాచ్ ల్లోనూ 14 వికెట్లు తీయడంతో ఆసీస్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ తుది జట్టులోకి నెసెర్ ఎంపిక అవుతాడా లేదా అనేది స్పష్టత లేదు. ఇటీవల టెస్టుల్లో బాగా రాణిస్తున్న స్కాట్ బోలాండ్ కే తుదిజట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Josh Hazelwood
Side Strain
WTC Final
Australia
Team India

More Telugu News