KCR: బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి సీఎం కేసీఆర్ భూమిపూజ
- హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో నిర్మాణం
- 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో భవనం
- పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం భవనం
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయనున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ కేంద్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో పదకొండు ఎకరాల విస్తీర్ణంలో పదిహేను అంతస్తుల్లో ఈ మానవ వనరుల కేంద్రాన్ని నిర్మించనున్నారు. పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.