Tractor: గుంటూరు జిల్లాలో పంటకాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్... ఏడుగురి మృతి

Seven died in a tractor mishap in Guntur district
  • శుభకార్యానికి వెళుతుండగా దుర్ఘటన
  • వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ ప్రమాదం
  • ఘటన స్థలిలోనే ముగ్గురి మృతి 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురి మృతి
  • ఆసుపత్రిలో ఒకరి మృతి
గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు వద్ద ఓ ట్రాక్టర్ పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలిలోనే ముగ్గురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడు నుంచి చేబ్రోలు మండలం జూపూడికి ఓ శుభకార్యం నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు కాగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోగా, కొందరు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.
Tractor
Canal
Deaths
Vatti Cherukuru
Guntur District

More Telugu News