tdp: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

Former TDP MLC Babu Rajendra Prasad suffers with  heart attack
  • తీవ్ర అస్వస్థతకు గురవడంతో రమేశ్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
  • వెంటనే చికిత్స అందించడంతో తప్పిన ప్రాణాపాయం
  • యాంజియోగ్రామ్‌ చేసి వివరాలు వెల్లడిస్తామన్న వైద్యులు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాజేంద్రప్రసాద్‌ను కుటుంబసభ్యులు విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. రాజేంద్రప్రసాద్‌కు యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్‌ గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
tdp
Babu Rajendra Prasad
heart attack

More Telugu News