Team India: డబ్ల్యూటీసీ ఫైనల్: లంచ్ సమయానికి 2 వికెట్లు పడగొట్టిన టీమిండియా

Team India scalps two wickets

  • లండన్ లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్
  • లంచ్ వేళకు ఆసీస్ స్కోరు 2 వికెట్లకు 73 పరుగులు

లండన్ లోని ఓవల్ మైదానంలో ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ లంచ్ వేళకు 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (26 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

లంచ్ కు కొద్దిముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఠాకూర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడిన వార్నర్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుత డైవింగ్ క్యాచ్ కు బలయ్యాడు. 

అంతకుముందు, ఆసీస్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగులేమీ చేయకుండానే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) వెనుదిరిగాడు. ఖవాజాను సిరాజ్ అవుట్ చేశాడు.

  • Loading...

More Telugu News