Yuva Galam Padayatra: టీమిండియా, ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీడీపీ యువగళం జెండాలు

Yuvagalam flags spotted in The Oval stadium which hosting WTC Final between India and Australia
  • లండన్ ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్
  • మైదానంలో సందడి చేసిన యూకే తెలుగు యువత కార్యకర్తలు
  • కెమెరాల దృష్టిని ఆకర్షించిన ఎన్నారై తెలుగు తమ్ముళ్లు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ సమరం జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కు వేదికగా నిలిచిన ప్రఖ్యాత ఓవల్ మైదానంలో టీడీపీ యువగళం జెండాలు దర్శనమిచ్చాయి. 

డబ్ల్యూటీసీ ఫైనల్ నేడు ప్రారంభం కాగా... యూకే తెలుగు యువత మైదానంలో సందడి చేసింది. బ్రిటన్ టీడీపీ ఎన్నారై సభ్యులు యువగళం జెండాలు చేతబూని, ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ కు మద్దతు తెలిపారు. జై లోకేశ్, జై టీడీపీ, జై ఎన్టీఆర్ నినాదాలు చేశారు. 

ఓవల్ స్టేడియంలో యువగళం జెండాలు ప్రదర్శిస్తున్న యూకే తెలుగు యువత కెమెరాల దృష్టిని ఆకర్షించింది.
Yuva Galam Padayatra
Flags
The Oval
WTC Final
London
Nara Lokesh
TDP
Andhra Pradesh
UK

More Telugu News