Chiranjeevi: భోళాశంకర్ నుంచి ఈసారి వీడియో లీక్ చేసిన చిరంజీవి

Chiranjeevi shares a video from Bhoola Shankar
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి భోళాశంకర్
  • అప్పుడప్పుడు లీకులు ఇస్తున్న చిరంజీవి
  • ఈసారి పాట షూటింగ్ వీడియోను పంచుకున్న మెగాస్టార్
మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్న చిరంజీవి మధ్య మధ్యలో లీకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. చిరు లీక్స్ పేరిట ఇప్పటివరకు పలు షూటింగ్ స్టిల్స్ ను జనాల్లోకి వదిలిన బాస్ ఈసారి ఏకంగా ఓ వీడియోనే లీక్ చేశారు. 

భోళాశంకర్ సినిమాలో సంగీత్ నేపథ్యంలో వచ్చే ఈ పాట చిత్రీకరణ వీడియోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం అందరూ ఈ పాటలో ఉండడం విశేషం. 

ఈ వీడియో లీక్ చేయడానికి ముందు చిరంజీవి ట్విట్టర్ లో హింట్ ఇచ్చారు. తాను మరోసారి లీక్ చేయబోతున్నానని, నేటి సాయంత్రం 5 గంటలకు ఇన్ స్టాగ్రామ్ లో ఆ లీక్ ఉంటుందని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఇన్ స్టాలో సాంగ్ షూట్ వీడియోను పోస్టు చేశారు. 

ఇందులో చిరంజీవి, తమన్నా, సుశాంత్, కీర్తి సురేశ్ లతో పాటు ఇతర నటీనటులందరూ కనువిందు చేశారు. ఇక ఈ వీడియో చివర్లో పాటకు సంబంధించిన చిన్న బిట్ ను కూడా పొందుపరిచారు. "జాం జాం జాం జాం జజ్జనక... తెల్లార్లూ ఆడుదాం తైతక్క" అంటూ సాగే ఆ హుషారైన పాటకు చిరు ఎనర్జటిక్ స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు.
Chiranjeevi
Bholaa Shankar
Video
Chiru Leaks

More Telugu News