Prabhas: ఒక్క కట్ లేకుండా ‘ఆదిపురుష్’ సెన్సార్ పూర్తి.. షాకిస్తున్న సినిమా నిడివి

 Censor Board Passes Adipurush Film With No Cuts Shocking Run Time Revealed
  • యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు
  • ఈ నెల 16న విడుదల కానున్న చిత్రం
ప్రస్తుత భారత సినీ పరిశ్రమ, సినీ అభిమానుల చూపు మొత్తం ‘ఆదిపురుష్’ చిత్రంపైనే ఉంది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఈ సినిమాపై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.  టీజర్, ట్రైలర్స్, తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ బిజినెస్ చేసింది. అన్ని భాషల్లో సినిమా రైట్స్ కు మంచి రేటు పలికిందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఆదిపురుష్ సెన్సార్ పూర్తి చేసుకుంది. 

జాతీయ సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇది అభిమానుల్లో జోష్ నింపుతోంది. అయితే మెగా చిత్రం రన్ టైమ్ ఏకంగా మూడు గంటలుగా ఉండటం కాస్త ఆశ్చర్యపరుస్తోంది. సెన్సార్ రిపోర్టు ప్రకారం సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత సుదీర్ఘ నిడివి ఉన్న సినిమా రాలేదు. అంతసేపూ దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా కనిపించనుంది. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు.
Prabhas
Adipurush
Censor Board
No Cuts
Run Time

More Telugu News