Anchor Suma: 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ లేకపోవడానికి కారణం ఇదే!

This is the reason why Anchor Suma was not in Adupurush event
  • ఈవెంట్ ను హోస్ట్ చేసే అవకాశం తొలుత తనకే వచ్చిందన్న సుమ
  • ఆ టైమ్ లో కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ కు వెళ్లానని వెల్లడి
  • బాగా తిరగడం వల్ల కాలికి గాయాలయ్యాయన్న స్టార్ యాంకర్
టాలీవుడ్ కు సంబంధించిన ఏ ఈవెంట్ అయనా యాంకర్ సుమ ఉండాల్సిందే. ఏళ్లు గడిచిపోతున్నా ఆమె స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేకపోతున్నారు. అనర్గళంగా, సమయస్ఫూర్తితో మాట్లాడుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టించడంలో సుమది ఒక ప్రత్యేకమైన స్థానం. అయితే, ఇటీవల తిరుపతిలో జరిగిన 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుమ కనపడలేదు. యాంకరింగ్ కు సుమ ఎందుకు రాలేదనే డౌట్ చాలా మందికి వచ్చింది. దీనికి కారణం ఏంటో తాజాగా సుమ వెల్లడించింది. 

ఆదిపురుష్ ఈవెంట్ ను హోస్ట్ చేసే అవకాశం తొలుత తనకే వచ్చిందని సుమ తెలిపింది. అయితే ఆ టైమ్ లో తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లానని... అందువల్ల అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాదు ట్రిప్ లో బాగా తిరగడం వల్ల, షూస్ కొరికేయడంతో కాలికి గాయాలయ్యాయని, ప్రస్తుతం గాయాలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని వెల్లడించింది. తన కాలి వేళ్లకు ప్లాస్టర్స్ వేసిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఆదిపురుష్' టీమ్ కు, ప్రభాస్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. 
Anchor Suma
Adipurush
Tollywood

More Telugu News