Sensex: వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- 223 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 71 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 2 శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు నష్టపోయి 62,625కి పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయి 18,563కి దిగజారింది. బ్యాంకింగ్, ఐటీ సూచీలు నష్టపోగా... రియాల్టీ షేర్లు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.12%), యాక్సిస్ బ్యాంక్ (1.25%), ఎల్ అండ్ టీ (1.00%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.93%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.71%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.68%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.46%), ఇన్ఫోసిస్ (-1.33%).