YS Vivekananda Reddy: వైఎస్ భాస్కర రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
- వైఎస్ వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర రెడ్డి అరెస్ట్
- చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర రెడ్డి
- తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు
- ఇరువైపుల వాదనల అనంతరం బెయిల్ కు నో!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించింది. నిన్నటి వరకు ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు బెయిల్ కు నో చెప్పింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీబీఐ ఆయనను ఏప్రిల్ 16వ తేదీన అరెస్ట్ చేసింది. భాస్కర రెడ్డి అరెస్టుకు రెండు రోజుల ముందు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకు ముందు రోజు భాస్కర రెడ్డి నివాసంలో ఉదయ్ కుమార్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించారు. ఈ క్రమంలో భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.