Google: ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనంటున్న గూగుల్

Google orders employees must work three days per a week in office

  • కరోనా సంక్షోభం సమయంలో వర్క్ ఫ్రం హోం బాట పట్టిన కంపెనీలు
  • ముగిసిన సంక్షోభం... తెరుచుకున్న కార్యాలయాలు
  • వర్క్ పాలసీని అప్ డేట్ చేసిన గూగుల్
  • నిబంధన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

కరోనా సంక్షోభం సమయంలో దిగ్గజ కంపెనీలు వర్క్ ఫ్రం హోం బాట పట్టడం తెలిసిందే. కార్యకలాపాలు మందగించకుండా, ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కంపెనీలు ప్రోత్సహించాయి. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులు లేవు. దాంతో కంపెనీలు మళ్లీ కార్యాలయాలు తెరిచి ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతున్నాయి. 

కొందరు ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం విధానానికే మొగ్గు చూపడంతో గూగుల్ వంటి సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనను అంగీకరించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని గూగుల్ హెచ్చరించింది. ఈ నిబంధన పాటించని ఉద్యోగుల పనితీరుకు తక్కువ గ్రేడింగ్ ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు తన నూతన వర్క్ పాలసీని గూగుల్ ప్రకటించింది. 

హాజరు విషయంలో తాము రాజీపడబోమని గూగుల్ సీపీవో ఫియోనా సిక్కోనీ స్పష్టం చేశారు. ఆఫీసులకు దగ్గరగా నివసిస్తున్న ఉద్యోగులు ఈ నిబంధన తప్పక పాటించాలని సూచించారు.

  • Loading...

More Telugu News