Telangana: తెలంగాణలో 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి.. ప్రమోషన్ పొందిన అధికారులు వీరే!

Telangana govt issues orders promoting Addl SPs and DSPs
  • నిన్న రాత్రి జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • పదోన్నతి పొందిన వారు డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సూచన
  • రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన డీజీపీ అంజనీ కుమార్
18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులకు సంబంధించిన జీవో నిన్న రాత్రి విడుదలయింది. పదోన్నతి పొందిన అధికారులంతా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన అధికారుల్లో నర్మద, పుష్ప కర్రి, శృతకీర్తి చేపూరి, కవిత గంజి, సునీత మోహన్, శ్రీనివాస్ మలినేని, కోట్ల నర్సింహారెడ్డి, శ్రీనివాసరావు, రవి కుమార్, వెంకటరావు, ప్రసన్న రాణి, చంద్రమోహన్, ఉష తిరునగరి తదితరులు ఉన్నారు. మరోవైపు పోలీసు అధికారులకు ప్రమోషన్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు. 
Telangana
SPs
DSPs
Promotions

More Telugu News