kiran kumar reddy: నాడు హరీశ్ రావు నాతో గొడవ పడ్డారు: కిరణ్ కుమార్ రెడ్డి
- తాను సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు రూ.7400 కోట్లు కేటాయించానని చెప్పిన మాజీ సీఎం
- జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న కిరణ్
- ప్రజా జీవితంలో ఉండాలా వద్దా అని ఆలోచించినట్లు వెల్లడి
జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి, ఏపీ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఉండాలా... వద్దా అని ఇన్ని రోజులు ఆలోచించినట్లు చెప్పారు. చివరకు జాతీయ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని భావించానన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.7400 కోట్లతో చిత్తూరు జిల్లాకు మంచి నీటి పథకం ప్రణాళికను చేశానని గుర్తు చేశారు. ఒక్క జిల్లాకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తారని నాడు హరీశ్ రావు తనతో గొడవ పడ్డారన్నారు.
కానీ ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆ మంచినీటి పథకాన్ని పక్కన పెట్టాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపివేయడం సరైనది కాదన్నారు. ప్రాంతీయ పార్టీలు ఖజనా నింపుకోవడంపై దృష్టి సారిస్తాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.